News June 21, 2024

నెల్లూరు: ఇంకా తొలగని జగన్ ఫొటోలు

image

ప్రభుత్వం మారడంతో అన్ని చోట్లా మాజీ సీఎం జగన్, మాజీ మంత్రుల ఫొటోలను అధికారులు తొలగించారు. ఎక్కడికక్కడ కొత్త సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో మాత్రం జగన్ ఫొటోలు ఇంకా దర్శనమిస్తున్నాయి. స్థానికంగా ఉన్న బిట్-1, 3 సచివాలయ భవనంపై సీఎం జగన్ అంటూ ఆయన ఫొటో, నవరత్నాల లోగో ఇంకా అలాగే ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.

Similar News

News December 21, 2025

నెల్లూరు TDPలో BCల హవా..!

image

పార్టీ ఏదైనా నెల్లూరు రాజకీయాల్లో రెడ్డి సామాజికవర్గ నేతలు కీలకంగా వ్యవహరిస్తుంటారు. TDP ట్రెండ్ మార్చి బీసీలకు ప్రాధాన్యమిస్తోంది. TDP జిల్లా అధ్యక్ష పదవికి పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మరికొందరు గట్టిగా ప్రయత్నించారు. కానీ MLC బీద రవిచంద్రకు మూడోసారి ఈ పదవిని అప్పగించారు. నెల్లూరు ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్, రాజ్యసభ ఎంపీగా బీద మస్తాన్ రావు ఉన్న విషయం తెలిసిందే.

News December 21, 2025

TDP నెల్లూరు జిల్లా బాస్‌గా బీద రవిచంద్ర

image

అందరూ ఊహించినట్లే టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర నియమితులయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేజర్లు వెంకటేశ్వర్లు రెడ్డికి అవకాశం ఇచ్చారు. జిల్లా అధ్యక్ష పదవికి పలువురు పోటీపడ్డారు. ఓ ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులకు అధ్యక్ష పదవి ఇప్పించేందుకు ప్రయత్నం చేశారు. మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పోటీపడగా.. బీదకే టీడీపీ అధిష్ఠానం అవకాశం దక్కింది.

News December 21, 2025

పెంచలకోనలో విశేష పూజలు

image

పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.