News June 21, 2024
నెల్లూరు: ఇంకా తొలగని జగన్ ఫొటోలు
ప్రభుత్వం మారడంతో అన్ని చోట్లా మాజీ సీఎం జగన్, మాజీ మంత్రుల ఫొటోలను అధికారులు తొలగించారు. ఎక్కడికక్కడ కొత్త సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో మాత్రం జగన్ ఫొటోలు ఇంకా దర్శనమిస్తున్నాయి. స్థానికంగా ఉన్న బిట్-1, 3 సచివాలయ భవనంపై సీఎం జగన్ అంటూ ఆయన ఫొటో, నవరత్నాల లోగో ఇంకా అలాగే ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.
Similar News
News September 19, 2024
మంత్రి నారాయణతో వైసీపీ కార్పొరేటర్లు భేటీ
నెల్లూరులోని వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. గురువారం ఉదయం నారాయణ సన్నిహితుడు విజయభాస్కర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో 15,16,47 డివిజన్ల వైసీపీ కార్పొరేటర్లు.. గణేశం వెంకటేశ్వర్లురెడ్డి, వేనాటి శ్రీకాంత్, రామకృష్ణ మంత్రి నారాయణతో భేటీ అయ్యారు. వీరు మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.
News September 19, 2024
నెల్లూరు: ఇంట్లో ఉక్కపోత.. రోడ్డుపై దోమలు
నెల్లూరు రూరల్ తెలుగుగంగా కాలనీ ఎంజీబీ లేవుట్ సమ్మర్ స్టోరేజీ రోడ్డు ప్రాంతంలో తరచూ పవర్ కట్ అవుతుంది. మంగళవారం అర్థరాత్రి పోయిన కరెంట్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చారు. మళ్లీ రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి కావొస్తున్నా కరెంటు రాకపోవడంతో పిల్లలు, వృద్ధులు దోమలతో ఇబ్బందులు పడ్డారు.
News September 19, 2024
నెల్లూరు: నవంబర్ 10 నుంచి అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని విజయవంతం చేయాలని కడప కలెక్టర్ శివశంకర్ అన్నారు. కలెక్టరేట్‌లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లపై రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నన్ పునీత్ కుమార్, SP హర్షవర్ధన్ రాజు, JC అదితి సింగ్, రిక్రూట్మెంట్ అధికారితో సమావేశమయ్యారు. కడపలో ఎంపికలు జరుగుతాయని, నెల్లూరు, తిరుపతి జిల్లాల అభ్యర్థులు హాజరుకావాలని అన్నారు.