News March 4, 2025
నెల్లూరు: ఇంటర్ పరీక్షకు 921 మంది గైర్హాజరు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లిష్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐవో డాక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం 79 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 27,613 మంది విద్యార్థులకుగాను 26,893 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 921 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్లో 1394 మంది విద్యార్థులకు 164 మంది విద్యార్థులు గైర్హజరయ్యారని ఆర్ఐవో తెలిపారు.
Similar News
News October 16, 2025
పారదర్శకంగా ఓటర్ల జాబితా నవీకరణ : కలెక్టర్

ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఫారం 6 లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫారం 6 లను సంపూర్ణంగా పూర్తిచేసే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు నూతన ఓటర్లకు అవగాహన కలిగించాలన్నారు.
News October 16, 2025
కావలి : పట్టపగలే ఇంట్లో దొంగతనం

కావలిలోని వడ్డెపాలెం రైల్వే క్వార్టర్స్ నందు రైల్వే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శైలజ ఇంట్లో మధ్యాహ్నం దొంగతనం జరిగింది. వారి బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్లి ఇంటికి రాగ ఇంటి వెనుక నుంచి తలుపులు బద్దలు కొట్టి ఇంటిని దోచుకున్నారు. రూ.30 వేల నగదు, 3 బంగారు ఉంగరాలు, వెండి మొలతాడు కనిపించట్లేదన్నారు. స్థానిక ఒకటవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 16, 2025
నెల్లూరు: బస్టాండ్ ఓ చోట.. బస్సులు ఆపేది మరోచోట

నిత్యం రద్దీగా ఉండే నెల్లూరు RTC బస్టాండ్ ఎదురుగా ఆటోలు, ప్రైవేట్ బస్సులు ఇష్టానుసారంగా ఆపేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు సర్వోదయ కాలేజీని అనుకుని యూనియన్ బ్యాంక్ వద్ద బస్టాండ్ని ఏర్పాటు చేశారు. అక్కడ మాత్రం వాహనాలు నిలపకుండా..కాలేజ్ ఎదురుగా ఆపేస్తున్నారు. ఫలితంగా బస్టాండ్ కట్టినా ప్రయోజనం ఉండడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.