News April 19, 2024
నెల్లూరు: ఇంటిని ఢీకొట్టిన కారు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి గూడూరుకు వెళ్తున్న కారు వెంగమాంబపురం సమీపంలోని పచ్చారుచేను వద్ద అదుపు తప్పింది. ఒక ఇంటి ప్రహరీ ఢీకొట్టింది. గోడ అవతలకు వెళ్లడంతో కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. మద్యం తాగి వాహనం నడపటంతోనే ప్రమాదం జరిగినట్లు గ్రామ ప్రజలు తెలిపారు.
Similar News
News December 7, 2025
నెల్లూరులో బస్సు డ్రైవర్పై కత్తితో దాడి

నెల్లూరులో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. బోసుబొమ్మ సెంటర్ వద్ద బస్సు డ్రైవర్, కండక్టర్పై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 7, 2025
నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనును సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్ను సంప్రదించాలన్నారు.
News December 7, 2025
సైదాపురం : వంతెనకు మరమ్మతులు చేయరూ?

సైదాపురం నుంచి గూడూరుకి వెళ్లే ప్రధాన రహదారిలో కైవల్య నదిపై వంతెన ఉంది. ఇది రాజంపేట నుంచి గూడూరుకి ప్రధాన రహదారి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.12 ఏళ్ల కిందట నిర్మించిన వంతెనపై గుంత ఏర్పడి కమ్మీలు బయటపడటంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.


