News April 19, 2024
నెల్లూరు: ఇంటిని ఢీకొట్టిన కారు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి గూడూరుకు వెళ్తున్న కారు వెంగమాంబపురం సమీపంలోని పచ్చారుచేను వద్ద అదుపు తప్పింది. ఒక ఇంటి ప్రహరీ ఢీకొట్టింది. గోడ అవతలకు వెళ్లడంతో కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. మద్యం తాగి వాహనం నడపటంతోనే ప్రమాదం జరిగినట్లు గ్రామ ప్రజలు తెలిపారు.
Similar News
News September 19, 2024
భూటాన్ దేశంలో సత్తా చాటిన నెల్లూరు విద్యార్థిని
నెల్లూరు నగరం స్థానిక స్టోన్ హౌస్ పేటలో 10వ తరగతి విద్యార్థిని తుమ్మల పూజిత ఇటీవల భూటాన్ దేశంలో జరిగిన అంతర్జాతీయ “ఆట్యా-పాట్యా” ఛాంపియన్ షిప్ 2023-24 క్రీడల్లో బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ విద్యార్థినిని ప్రత్యేకంగా బుధవారం సత్కరించారు. క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆదర్శనీయం అని ప్రశంసించారు.
News September 18, 2024
నెల్లూరు జిల్లాలో పలువురికి వైసీపీ కీలక బాధ్యతలు
నెల్లూరు జిల్లాలో పలువురికి కీలక పదవులు అప్పగిస్తూ వైసీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు- కాకాణి
రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్- ఆనం విజయకుమార్ రెడ్డి
సిటీ ఇన్‌ఛార్జ్- పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు కార్పొరేషన్ అబ్జర్వర్- అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు ఎంపీ ఇన్‌ఛార్జ్- ఆదాల ప్రభాకర్ రెడ్డి
రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి- మహ్మమద్ ఖలీల్
News September 18, 2024
వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాణి
వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నియమించినట్లు సమాచారం. ఎన్నికల్లో జిల్లాలోని అన్నీ స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో కాకాణికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి పార్టీ మారడంతో జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. తాజాగా ఆయనను నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.