News September 19, 2024
నెల్లూరు: ఇంట్లో ఉక్కపోత.. రోడ్డుపై దోమలు

నెల్లూరు రూరల్ తెలుగుగంగా కాలనీ ఎంజీబీ లేవుట్ సమ్మర్ స్టోరేజీ రోడ్డు ప్రాంతంలో తరచూ పవర్ కట్ అవుతుంది. మంగళవారం అర్థరాత్రి పోయిన కరెంట్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చారు. మళ్లీ రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి కావొస్తున్నా కరెంటు రాకపోవడంతో పిల్లలు, వృద్ధులు దోమలతో ఇబ్బందులు పడ్డారు.
Similar News
News January 4, 2026
ఒక్కొక్కడికి దూల తీరుస్తా: ఉదయగిరి ఎమ్మెల్యే

ఉదయగిరిలో ఓ పెద్ద మనిషి <<18759752>>నీచంగా<<>> ఆలోచించి మహిళతో ఆరోపణలు చేయిస్తున్నారని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ అన్నారు. ‘నేను విజయవాడలోని ఓ హోటల్లో ఉన్నప్పుడు వెంగమాంబను అక్కడికి రప్పించి తప్పుడుగా వీడియోలు చిత్రీకరించాలని చూశారు. అప్పటి నుంచి నాతో సహా మా టీం అంతా ఆమెను దూరం పెట్టింది. నన్ను ఏదో చేస్తే వెళ్తాననుకుంటున్నారు. 25ఏళ్లు ఉదయగిరిలోనే ఉంటా. ఒక్కొక్కడికి దూల తీరుస్తా’ అని కాకర్ల హెచ్చరించారు.
News January 4, 2026
వెంగమాంబ ఆరోపణలు అవాస్తవం: కాకర్ల

ఉదయగిరి MLA కాకర్లపై వెంగమాంబ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. ‘ఆమెను రెండుమూడు సార్లు కారులో ఎక్కుంచుకున్న విషయం నిజమే. అప్పుడు నా భార్య కూడా ఉంది. కానీ ఆమె ఆరోపణల్లో నిజం లేదు. ఆమె మూడు నెలలు మాత్రమే మా నియోజకవర్గంలో పని చేశారు. MLA టికెట్ TDP తరఫున చంద్రబాబు ఇస్తారు. నేను ఎలా ఇస్తాను. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసు. వారిపై లీగల్ గా వెళుతున్నాం’ అని కాకర్ల స్పష్టం చేశారు.
News January 4, 2026
నెల్లూరు: కారులో తనిఖీలు.. భారీగా బంగారం సీజ్

కారులో ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలను GST, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద కారును ఆపి తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా కారులో ఉన్న రూ.3.7 కోట్ల విలువజేసే 3.1 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని ట్రెజరీలో భద్రపర్చారు. సదరు వ్యక్తి వ్యాపార లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు.


