News September 19, 2024

నెల్లూరు: ఇంట్లో ఉక్కపోత.. రోడ్డుపై దోమలు

image

నెల్లూరు రూరల్ తెలుగుగంగా కాలనీ ఎంజీబీ లేవుట్ సమ్మర్ స్టోరేజీ రోడ్డు ప్రాంతంలో తరచూ పవర్ కట్ అవుతుంది. మంగళవారం అర్థరాత్రి పోయిన కరెంట్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చారు. మళ్లీ రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి కావొస్తున్నా కరెంటు రాకపోవడంతో పిల్లలు, వృద్ధులు దోమలతో ఇబ్బందులు పడ్డారు.

Similar News

News October 12, 2024

నెల్లూరు జిల్లాలో ఆనం పర్యటన

image

నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మూడు రోజులు పర్యటించనున్నారు. అక్టోబర్ 13,14, 15 వ తేదీలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గత పది రోజులుగా విజయవాడ, తిరుమల, శ్రీశైలంలోని దసరా ఉత్సవాలలో పాల్గొని జిల్లా పర్యటనకు వస్తున్నారు.

News October 12, 2024

సూళ్లూరుపేట: రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాదులు!

image

కవరైపెట్టె రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును భాగమతి ఎక్స్‌ప్రెస్(12578) ఢీకొనడం వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉన్నట్లు భారతీయ రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)తో విచారణ చేయించనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో మరికొన్ని విషయాలు తెలుస్తాయని దక్షణమధ్య రైల్వే జీఎం ఆర్‌ఎన్ సింగ్ తెలిపారు. తిరవళ్లూరు వద్ద పనులు చేపట్టి రైళ్ల రాకపోకలు పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామన్నారు.

News October 12, 2024

నెల్లూరు జిల్లాలో మద్యం షాపులకు 3,833 దరఖాస్తులు

image

నెల్లూరు జిల్లాలో మద్యం దుకాణాల కోసం గడువు ముగిసే సమయానికి 3,833 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు అధికారులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో మొత్తం 182 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. కాగా దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.76.66 కోట్ల ఆదాయం వచ్చినట్లు వారు వెల్లడించారు.