News July 10, 2024
నెల్లూరు: ఇన్‌స్టాలో పరిచయంతో అదృశ్యం.. ఎస్సై చొరవతో ఇంటికి

అదృశ్యమైన ఇద్దరు బాలికలు ఎస్సై నాగార్జున రెడ్డి చొరవతో సురక్షితంగా ఇళ్లకు చేరారు. పొదలకూరు మండలానికి చెందిన బాలికలు పాఠశాలకు వెళ్తున్నామంటూ సంగం చేరుకున్నారు. ఆ తర్వాత ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి ఇన్‌స్టాలో పరిచయమైన శివప్రసాద్ అనే కడప జిల్లా వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఓ బాలిక ఇంట్లో లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.
Similar News
News January 2, 2026
ఉదయగిరి: మళ్లీ పులి వచ్చింది..!

ఉదయగిరి మండలం కొండకింద గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. బండగానిపల్లి ఘాట్ రోడ్డు, దుర్గం, జి.చెరువుపల్లి అటవీ ప్రాంతాల్లో తిరగడాన్ని తాము చూశామని నాలుగైదు రోజులుగా ప్రజలు చెబుతున్నారు. తాజాగా గురువారం రాత్రి 7గంటల సమయంలో కుర్రపల్లి-కృష్ణాపురం మార్గంలో జువ్విమాను బాడవ వద్ద పులి రోడ్డు దాటడాన్ని కృష్ణారెడ్డిపల్లికి చెందిన దేవసాని శ్రీనివాస్ రెడ్డి చూశారు.
News January 2, 2026
నెల్లూరు: సర్పంచ్ ఎన్నికలు అప్పుడేనా..?

సర్పంచ్ ఎన్నికలు జనవరిలోనే జరపాలని ప్రభుత్వం గతంలో చెప్పడంతో నెల్లూరు జిల్లాలో గ్రామ రాజకీయాలు స్పీడందుకున్నాయి. జిల్లాలోని 722 పంచాయతీల్లో నాయకులు మంతనాలు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు పంచాయతీ విభజన జరగకూడదు. ప్రస్తుత సర్పంచ్‌ల గడువు ఏప్రిల్‌తో ముగుస్తుంది. ఆ తర్వాతే పంచాయతీల విభజన చేసిన జూన్ లేదా జులైలో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో పల్లె రాజకీయాలు స్లో అయ్యాయి.
News January 2, 2026
నెల్లూరు: మొదలైన కోడి పందేలు..

మరో రెండు వారాల్లో సంక్రాంతి రాబోతుంది. గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు సై అంటున్నారు. కొండాపురం(M) తూర్పుయర్రబల్లి శివారులో నాలుగు రోజులుగా కోడి పందేలు జరగుతున్నట్లు తెలుస్తోంది. పక్కల జిల్లాల నుంచి పలువురు వస్తున్నారట. రూ.లక్షలో చేతులు మారుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ఏం అంటారో చూడాలి.


