News December 24, 2024

నెల్లూరు: ఈ-చలాన్లు చెల్లించని వారికి ALERT 

image

ఈ-చలాన్లు చెల్లించకుండా తిరుగుతున్న వాహనదారులపై హైకోర్టు ఆదేశాలతో కొరడా ఝుళిపించేందుకు నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. తక్షణమే చలాన్లు చెల్లించకపోతే వాహనాలను సీజ్ చేసే అవకాశం ఉంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పోలీసు అధికారులు ఈ చలాన్లు విధిస్తుంటారు. దీంతో నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నుంచి నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Similar News

News December 25, 2024

కనువిందు చేస్తున్న పులికాట్ సరస్సు

image

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తోంది. దీంతో పులికాట్ సరస్సు జలకళను సంతరించుకుంది. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా సరస్సు అలల తాకిడి పర్యాటకుల్ని కనువిందు చేస్తోంది. కొన్నిచోట్ల విహంగాలు కూడా కనిపిస్తున్నాయి.

News December 25, 2024

NLR: 30 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్షలు

image

పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు నెల్లూరు నగరంలోని పోలీసు కవాతు మైదానంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు జిల్లాలో 20,356 మంది ప్రిలిమినరీ పరీక్షలు రాయగా వారిలో 4,600 మందికిపైగా దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. ఈ పరీక్షలు ఈనెల 30 నుంచి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్నారు.

News December 25, 2024

నెల్లూరు: 10వ తరగతి విద్యార్థులకు గమనిక

image

నెల్లూరు జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు తత్కాల్ పథకం కింద ఈనెల 27 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని DEO డాక్టర్ బాలాజీ రావు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు తత్కాల్ కింద రూ.1000 ఫైన్‌తో ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చన్నారు. సకాలంలో ఫీజులు చెల్లించి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు.