News August 21, 2024

నెల్లూరు: ఈ నెల 23న జాబ్ మేళా

image

నగరంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 23న ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి ఎమ్.వినయ్ కుమార్ మంగళవారం తెలిపారు. వివిధ కంపెనీలలో ఖాళీ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు జాబ్ మేళాకు హాజరు కావాలని తెలిపారు.

Similar News

News July 11, 2025

మనుబోలు: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

మనుబోలు మండలం పల్లిపాలెం వద్ద శుక్రవారం ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. TPగూడూరు(M) గంగపట్నంకు చెందిన లక్ష్మయ్య (22) కట్టువపల్లిలో రొయ్యల గుంట వద్ద పని చేస్తున్నాడు. ఉదయాన్నే బైకుపై పల్లిపాలెం వెళ్తూ దారిమధ్యలో గేదె అడ్డు రావడంతో ఢీకొట్టాడు. తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

News July 11, 2025

కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో బెయిల్

image

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో ఊరట లభించింది. కృష్ణపట్నం పోర్టు రోడ్ పంట పాలెం వద్ద అక్రమ టోల్ గేట్ పెట్టి వాహనాలకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో రైల్వే కోర్ట్ ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి నిషాద్ నాజ్ షేక్ బెయిల్ మంజూరు చేశారు.

News July 10, 2025

కావలి: గోడ కూలి బేల్దారి మృతి

image

కావలిలో గోడ కూలి బేల్దారి మృతి చెందాడు. డ్రైనేజీ కాలువ నిర్మించేందుకు తవ్వుతుండగా పక్కనేఉన్న గోడ కూలి మృతి చెందాడు. మృతుడు బోగోలు మండలం సాంబశివపురం తాతా వెంకయ్యగా గ్రామస్థులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని బేల్దారి మేస్త్రిలు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.