News June 22, 2024

నెల్లూరు: ఈ నెల 24న DKWలో జాబ్ మేళా

image

నెల్లూరులోని డీకే డబ్ల్యూ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24న జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ మేళాలో ఈ సంవత్సరం డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు కూడా పాల్గొనవచ్చని చెప్పారు. చెన్నై, శ్రీసిటీలోని పలు కంపెనీలు ఇందులో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.

Similar News

News November 24, 2025

బుచ్చిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసింది రౌడీషీటర్లు..?

image

బుచ్చిలో గత శనివారం ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వారు నెల్లూరుకు చెందిన రౌడీషీటర్లుగా నిర్ధారించి ఎస్పీ ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. హైవేపై కారు డోరు తెరిచి ఉంచడంతో నెల్లూరు నుంచి ఆత్మకూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ కొట్టారు. వెంటనే కారులో ఉన్న వారు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. కారులో బీరు బాటిల్ కూడా దర్శనమిచ్చాయి.

News November 24, 2025

నెల్లూరు మేయర్ భవితవ్యం ఎటు?

image

నెల్లూరు మేయర్ స్రవంతి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆమెను పదవి నుంచి దించేందుకు TDP అవిశ్వాస తీర్మానానికి దిగింది. గతంలో MLA కోటంరెడ్డి YCP తరఫున మేయర్‌గా ఉన్న ఆమెను TDPలోకి ఆహ్వానించారు. ఆమె సమ్మతం వ్యక్తం చేసినా ధిక్కార స్వరం ఎదురైంది. దీంతో TDP అప్పట్లో అవిశ్వాసానికి దిగినా కొన్ని నిబంధనల మేరా కుదరలేదు. ప్రస్తుతం ఆ పార్టీ నేతలు కలెక్టర్‌ను కలిసి ఆమెకు నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

News November 24, 2025

నెల్లూరు: ZPలో పోస్టులు ఖాళీ.. పాలన అధోగతీ.!

image

ZP(జిల్లాపరిషత్) అంటే అన్నీ శాఖలకు పెద్దన్నలాంటిది. ఇందులో CEO నుంచి స్వీపర్ వరకు 1,247 పోస్టులు ఉండాలి. వీటిలో 929పోస్టులు మాత్రమే భర్తీ కాగా 338 ఖాళీగా ఉన్నాయి. ప్రధానమైన MPDO పోస్టులు 46 ఉండాల్సి ఉండగా 16 చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు-133, వాచ్‌మెన్‌లు-98, వాటర్ మెన్‌లు-39 వరకు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేస్తే తప్ప పాలన గాడిలో పడదని పలువురు అభిప్రాయడుతున్నారు.