News March 26, 2025
నెల్లూరు: ఉచిత DSC కోచింగ్‌కి ఎంపికైన వారి వివరాలివే.!

నెల్లూరు జిల్లాలో ఉచిత DSC కోచింగ్‌కి ఎంపికైన S.C, S.T అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ వివరాలను కింది 2 వెబ్సైట్లలో పొందుపరిచారు. కాబట్టి DSC ఉచిత కోచింగ్‌కి దరఖాస్తు చేసుకున్న వారు చెక్ చేసుకోవాలని, నెల్లూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణి తెలియజేశారు.
➤ https://mdfc.apcfss.in
➤https://jnanbhumi.ap.gov.in
Similar News
News November 3, 2025
నెల్లూరు: 1,282.63 హెక్టార్లలో పంటకు నష్టం

తుపాన్ కారణంగా జిల్లాలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 33 శాతం కంటే ఎక్కువగా నష్టం జరిగిన పంట వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 79,333 హెక్టార్లలో వరి సాగు చెయ్యగా 1282.63 హెక్టార్లలో పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వేరుసెనగ 11.4 హెక్టార్లు, మొక్క జొన్న 21.7 హెక్టార్లు, సజ్జ పంటకు 5 హెక్టార్లలో నష్టం వాటిల్లింది.
News November 3, 2025
YCP నేతపై అర్ధరాత్రి కత్తులతో దాడి

వెంకటాచలం మండల YCP నేత, రాష్ట్ర ST సెల్ జాయింట్ సెక్రెటరీ బదనాపురి గోపాల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం దాడి చేసినట్లు కుటుంబీకులు తెలిపారు. అర్ధరాత్రి గోపాల్ ఇంట్లో ఉండగా కత్తులతో దాడికి తెగబడ్డారన్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. ఓ పార్టీ నేతలు తమ కుమారుడిపై దాడి చేశారని గోపాల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రికిలో చికిత్స కొనసాగుతోంది.
News November 3, 2025
తుప్పు పడుతున్న సబ్ మిషన్ ప్రాజెక్ట పరికరాలు

ఉదయగిరి మండలంలోని గండిపాలెం జలాశయ సమీపంలో సుమారు ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన రాజీవ్ టెక్నాలజీ సబ్మిషన్ ప్రాజెక్ట్ మంచినీటి పథక యంత్ర పరికరాలు తుప్పుపడుతున్నాయి. దీంతో ఫ్లోరిన్ రహిత తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం ప్రజలు వాటర్ ప్లాంట్లపై ఆధారపడి తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్వందించాలని కోరుతున్నారు.


