News October 24, 2024
నెల్లూరు: ఉచిత DSC శిక్షణకు దరఖాస్తులు

ఏపీ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమశాఖ వారి ఉత్తర్వుల మేరకు జిల్లాలోని SC, ST అభ్యర్థులకు DSC పరీక్ష కొరకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో 3 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు నెల్లూరు ASWO హాజరత్తయ్య తెలిపారు. అభ్యర్థులు http://jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 25 చివరి తేది అని, ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం కోరారు.
Similar News
News July 9, 2025
ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు..!

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్దదుమారం రేపాయి. తెలుగు మహిళలు పలుచోట్ల ఆందోళనలు చేసి ప్రసన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న ఉదయం కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ప్రసన్నపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. తనపై హత్యాయత్నం చేశారని ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా దానిపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.
News July 9, 2025
నల్లపురెడ్డిపై మహిళా కమిషన్ ఫిర్యాదు

YSRCP మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజను కలిసి కార్పొరేటర్ ఉషారాణి ఫిర్యాదు చేశారు. ప్రశాంతి రెడ్డిపై చేసిన అవమానకర వ్యాఖ్యలు దౌర్జన్యంగా ఉన్నాయని విమర్శించారు. నల్లపురెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
News July 8, 2025
10న నెల్లూరు జిల్లాలో కీలక సమావేశం

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 3,600 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు 143 కళాశాలల్లోనూ ఈ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. డీఈవో బాలాజీ రావు, ఎస్‌ఎస్‌ఏ పీడీ వెంకటప్పయ్య పాల్గొన్నారు.