News March 24, 2024
నెల్లూరు: ఉదయం కండువా… సాయంత్రం సీటు

గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు రాజకీయాల్లో సంచలనంగా మారారు. కొద్ది రోజులుగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆయన టీడీపీ, జనసేన పార్టీల్లో చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరకు బీజేపీ గూటికి చేరారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నారు. సాయంత్రానికి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. గతంలోనూ ఆయన తిరుపతి ఎంపీగా వ్యవహరించారు.
Similar News
News November 23, 2025
నెల్లూరు నగర మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి గ్రీన్ సిగ్నల్!

నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంపై మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లతో చర్చించారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న నిర్ణయంపై ఇరువురు నేతల అంగీకారం తెలిపారు. సోమవారం కార్పొరేటర్లందరూ కలెక్టర్‌ను కలిసి నోటీసు ఇవ్వనున్నారు.
News November 23, 2025
నిరుద్యోగ యువతకు ఈ సంస్థ గురించి తెలుసా.?

గ్రామీణ నిరుద్యోగ యువతకు వెంకటాచలంలో ఉన్న స్వర్ణభారత్–సోమా సాంకేతిక శిక్షణా సంస్థ ఓ ఆశాదీపంగా నిలిచింది. డిమాండ్ ఉన్న రంగాలలో సాంకేతిక నిపుణులతో ఉచిత శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. గడచిన 14 ఏళ్లలో 5,420 మంది ఇక్కడ శిక్షణ పొందగా 80% మందికి పైగా యువకులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. శిక్షణ పొందే వారికి ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తున్నారు.
News November 23, 2025
కోటంరెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ భేటీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. మాగుంట లేఔట్‌లోని కోటంరెడ్డి కార్యాలయానికి నారాయణ వచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.


