News August 1, 2024
నెల్లూరు: ఉదయాన్నే పింఛన్ల పంపిణీ

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గురువారం తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ మొదలైంది. తొలిరోజే అందరికీ నగదు అందజేయాలన్న లక్ష్యంతో సచివాలయ అధికారులు ఉదయాన్నే ఇంటింటికీ తిరుగుతున్నారు. లబ్ధిదారులకు రూ.4 వేలు చొప్పున పింఛన్ ఇస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఖాజా నగర్ 6వ వార్డు టీడీపీ నాయకులు బచ్చా భాయ్, ఉస్మాన్ రహమద్ బాషా, షఫీతో కలిసి నగదు పంపిణీ చేశారు.
Similar News
News January 20, 2026
ఆ పాపాలే మీకు శాపాలు: కాకాణి

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆత్మకూరులో ఆయన మాట్లాడుతూ. కూటమి పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని చెప్పారు. జగనన్న తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న పాపాలు వారికి భవిష్యత్తులో శాపాలుగా మారుతాయని చెప్పారు. ఎంపీ గురుమూర్తి, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News January 20, 2026
నెల్లూరులో దొంగ నాగ సాధువులు హల్‌చల్

నాగ సాధువుల ముసుగులో ఓ ఇద్దరు వ్యక్తులు నెల్లూరులో హల్‌చల్ చేశారు. ఓ ఇంటికి వెళ్లి అన్నం పెట్టమని అడిగారు. వారు లేదని చెప్పడంతో వారితో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో స్థానికులు వారిపై దాడికి ప్రయత్నించారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాగసాధువు ముసుగులో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. బూతులు మాట్లాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
News January 20, 2026
నెల్లూరు: తల్లులకు తప్పని నిరీక్షణ.!

ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం నీరుగారుతోంది. గతేడాది నుంచి ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా 24,459 మంది గర్భిణీలు నమోదవ్వగా 12,353 మందికి ఆర్థిక సాయం అందింది. 12,106 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 10,656 మంది దరఖాస్తులు వివిధ సమస్యలతో రిజెక్ట్ అయ్యాయి. మొదటి కాన్పుకు ₹5 వేలును రెండు విడతల చొప్పున ఇవ్వాలి. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ఒకే విడతలో ₹6వేలు తల్లి ఖాతాకు జామ చేస్తారు.


