News September 9, 2024

నెల్లూరు: ఉద్యోగం పేరిట మోసం ..యువకుడు సూసైడ్

image

ఉద్యోగం ఇప్పిస్తామని మోసగించడంతో నెల్లూరు యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల కథనం.. నవాబుపేట వాసి హరినాథ్(44) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నత కంపెనీలో ఉద్యోగాలు వెతుకుతుండగా.. నెల్లూరుకు చెందిన ప్రేమ్ చంద్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.7లక్షలకు పైగా తీసుకున్నాడు. బాధితుడు నిలదీయగా రూ.5.57 లక్షలు అకౌంట్లో వేశానని నకిలీ రసీదు ఇచ్చి పరారయ్యాడు. దీంతో ఈనెల 5న హరి సూసైడ్ చేసుకున్నాడు.

Similar News

News November 2, 2025

మైపాడు బీచ్‌లో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మృతి

image

మైపాడు బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. బీచ్‌లో స్నానానికి దిగి ఇంటర్ విద్యార్థులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హుమయూన్, తాజిన్, ఆదిల్‌గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 2, 2025

గొలగముడి: లడ్డూ కౌంటర్ 10 గంటలకు ముందే క్లోజ్

image

వెంకటాచలం మండలం గొలగముడి వెంకయ్య స్వామి గుడికి జిల్లాలోనే మంచి గుర్తింపు ఉంది. ఇక్కడకు ఒక్క శనివారమే సుమారు 10 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ భక్తులు ఎంతో భక్తితో తీసుకొనే లడ్డూ ప్రసాదం అందరికి అందడం లేదు. కనీసం రాత్రి 10 గంటలు కాకముందే కౌంటర్ మూసేశారు. దీంతో భక్తులు ప్రసాదం తీసుకోకుండానే నిరాశ చెందుతున్నారు. పలుమార్లు ఇలానే జరుగుతుందని భక్తులు వాపోతున్నారు.

News November 2, 2025

NLR: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు

image

నెల్లూరు జిల్లాలోని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు రెండు రోజులుగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. BNS168 సెక్షన్ ప్రకారం సూచనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. గ్రూప్ పేరు, మొబైల్ నంబర్స్, గ్రూప్ సభ్యుల సంఖ్య, గ్రూప్ దేని కోసం వాడుతున్నారు? అనే వివరాలను పోలీసు స్టేషన్లో అందజేయాలంటున్నారు. గ్రూపులో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ బాధ్యత అడ్మిన్లదేనని నోటిసుల్లో స్పష్టం చేస్తున్నారు.