News March 21, 2025

నెల్లూరు: ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు నోటిఫికేషన్

image

నెల్లూరు జిల్లాలో ఖాళీ అయిన విడవలూరు ఎంపీపీ, దగదర్తి వైస్ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ZP సీఈవో విద్యారమ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికకు సంబంధించి ముందస్తుగా ఈ నెల 23వ తేదీలోగా సభ్యులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు ఆయా మండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు జారీచేశామన్నారు.

Similar News

News March 23, 2025

కూటమి ప్రభుత్వం జగన్‌పై విష ప్రచారం చేస్తుంది: పర్వత రెడ్డి

image

రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై విషపూరితమైన ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. నాడు నేడు ద్వారా జగన్ 45 వేల పాఠశాలలను ఆధునీకరణ చేశారన్నారు. అలాంటి జగన్‌ను.. మంత్రి నారా లోకేశ్ పాఠశాలలను నిర్వీర్యం చేశారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కార్పొరేటర్‌లు, నేతలు పాల్గొన్నారు

News March 23, 2025

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం: మంత్రి 

image

నేటికి పిల్లలు నేల మీద కూర్చుని చదవటం బాధాకరమని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే  అన్ని పాఠశాలలో బల్లలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని పలు మున్సిపల్ పాఠశాలలను ఆయన పరిశీలించారు. వైకుంఠపురంలోని అంగన్వాడి కేంద్రాన్ని మరో భవనంలోకి తరలించాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 

News March 23, 2025

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం: మంత్రి 

image

నేటికి పిల్లలు నేల మీద కూర్చుని చదవటం బాధాకరమని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే  అన్ని పాఠశాలలో బల్లలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని పలు మున్సిపల్ పాఠశాలలను ఆయన పరిశీలించారు. వైకుంఠపురంలోని అంగన్వాడి కేంద్రాన్ని మరో భవనంలోకి తరలించాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

error: Content is protected !!