News April 24, 2024
నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్

నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి హరినారాయణ్కు నామినేషన్ అందించారు. విజయసాయిరెడ్డి వెంట రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, న్యాయవాది మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఉన్నారు.
Similar News
News December 26, 2025
వెంకటగిరిలో భారీ దొంగతనం

వెంకటగిరిలో భారీ దొంగతనం వెలుగు చూసింది. తోలిమిట్టకు చెందిన చీమల కృష్ణయ్య టీచర్గా పనిచేస్తున్నారు. కుటుంబంతో కలిసి ఆయన బుధవారం ఊరికి వెళ్లారు. ఆయన ఇంటి తాళం తెరిచి ఉండటాన్ని స్థానికులు గురువారం సాయంత్రం గుర్తించి కృష్ణయ్యకు సమాచారం ఇచ్చారు. 60 సవర్ల బంగారం, అర కేజీ వెండి ఆభరణాలు, రూ.2లక్షలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
News December 26, 2025
పెన్నా నదిలో చిక్కుకున్న వృద్ధుడిని కాపాడిన పోలీసులు

పెన్నా నదిలో చిక్కుకున్న వృద్ధుడిని కోవూరు పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఓ వృద్ధుడు గేదెలను తోలుకుంటూ జమ్మిపాళెం వద్ద పెన్నా నదిలోకి వెళ్లిన సమయంలో పెన్నా బ్యారేజ్ నుంచి నీరు విడుదల కావడంతో నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో ఘటనా ప్రాంతానికి చేరుకొని స్థానిక ఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టి వృద్ధుడిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.