News June 22, 2024

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డికి కీలక పదవీ

image

TDP పార్లమెంటరీ కోశాధికారిగా నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశమైంది. సమావేశానికి టీడీపీ ఎంపీలు, సీనియర్ నేతలు, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. తనపై నమ్మకంతో TDP పార్లమెంటరీ పార్టీ ట్రెజరర్‌గా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

Similar News

News November 5, 2024

హైకోర్టులో కాకాణి పిటిషన్

image

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఇటీవల టీడీపీ నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంకటాచలం, ముత్తుకూరు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయ్యాయి. వీటిని కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై ఇవాళ జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ విచారణ చేపట్టనున్నారు.

News November 5, 2024

8న వెంకటాచలంలో ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ డే 

image

సర్వేపల్లి నియోజకవర్గం చెముడు గుంటలోని శిరిడిస్ కళ్యాణ మండపంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎస్టీల కోసం శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటచలం మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలుత ఆయన అర్జీదారుల నుంచి 550 పైగా అర్జీలు స్వీకరించారు.

News November 4, 2024

పంచాయతీ సెక్రటరీ లైంగిక వేధింపులపై నెల్లూరు SPకి ఫిర్యాదు

image

లైంగికంగా వేధిస్తున్నాడని పంచాయతీ సెక్రటరీపై ఓ గిరిజన మహిళ SPకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు వివరాల ప్రకారం.. రాపూరు పంచాయతీలోని కోడూరుపాడుకు చెందిన ఓ గిరిజన మహిళ తన తండ్రి చనిపోవడంతో డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని పంచాయతీ సెక్రటరీ చెంచయ్యను కోరింది. ఆయితే ఆయన తనతో వీడియో కాల్ మాట్లాడాలని, తన కోరిక తీర్చితే డెత్ సర్టిఫికెట్ 5 నిమిషాల్లో ఇస్తానని వేధించాడని చెప్పింది. సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేసింది.