News December 31, 2024

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి కీలక ప్రకటన

image

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్‌ డిసెంబర్ 26 న స్వర్గస్థులయ్యారు. మన్మోహన్ సింగ్‌ మరణాన్ని చింతిస్తూ 2024 డిసెంబర్ 26 నుంచి 2025 జనవరి 1 వరకు భారత ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. మాజీ ప్రధాని మరణానికి సంతాప సూచకంగా పార్టీ ఆదేశాల మేరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నారని ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు.

Similar News

News January 25, 2025

నెల్లూరు: 104 అంబులెన్సుల్లో డ్రైవర్ ఉద్యోగాలు

image

కొండాపురం, లింగసముద్రం మండలాలతో పాటు నెల్లూరు, కావలి బఫర్ 104 అంబులెన్సుల డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటరెడ్డి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అర్హులని వెల్లడించారు. అర్హత కలిగిన వారు నెల్లూరు జీజీహెచ్ ఆవరణలోని 104 కార్యాలయంలో జనవరి 27, 28 తేదీల్లో సంప్రదించాలని సూచించారు.

News January 25, 2025

దుత్తలూరు: మసిబారుతున్న పసి బతుకులు

image

దుత్తలూరు మండలంలోని చిన్నారులు పాఠశాలలకు వెళ్లి చదువుకోవాల్సిన వయసులో బొగ్గుబట్టీలు, ఇటుక బట్టీలు, కంకర క్రషర్ల వద్ద పనిచేస్తూ  జీవనం గడుపుతున్నారు. కాలుష్యం నడుమ వారి ఆరోగ్యం దెబ్బతింటున్న పట్టించుకునే అధికారులు కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. బట్టీల వద్ద కార్మిక చట్టాలు అమలుకావటం లేదు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు వాపోయారు.

News January 25, 2025

కావలి వెంకటేశ్వర థియేటర్‌కు నోటీసులు జారీ

image

కావలి పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌కు RDO వంశీకృష్ణ నోటీసులు జారీచేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రానికి ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కానీ థియేటర్ యాజమాన్యం 24వ తేదీ కూడా అధిక రేట్లకు విక్రయించడంతో కావలికి చెందిన వెంకటేశ్వరరావుతోపాటు మరికొంతమంది ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం దీనిపై వివరణ ఇవ్వాలని RDO ఆదేశించారు.