News May 12, 2024
నెల్లూరు: ఎన్నికల ఎఫెక్ట్.. కల్లుకి డిమాండ్

నెల్లూరు జిల్లాలో ఎన్నికల వేళ కల్లుకి డిమాండ్ పెరిగింది. సాధారణంగా ఎండకాలంలో మందుకంటే కల్లునే ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మందు బంద్ చేయడంతో కల్లుకి డిమాండ్ పెరిగింది. కొందరు పక్క ఊర్లకి వెళ్లి మరీ తాగుతున్నారు. కొన్నిచోట్ల కల్లు దొరకకపోవడంతో మందుబాబులు వెనుతిరుగుతున్నారు. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News February 10, 2026
ఆ వాట్సాప్ గ్రూపుల్లో చేరవద్దు: నెల్లూరు SP

వాట్సాప్ మెసేజ్‌లు నమ్మి పెట్టుబడులు పెట్టరాదని నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్. అజితా వెజెండ్ల ఓ ప్రకటనలో హెచ్చరించారు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తెలియని వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ కావద్దన్నారు. ఈజీ మనీ ఆశతో ఎలాంటి లింకులను ఓపెన్ చేయొద్దని సూచించారు. వాట్సాప్‌లో వచ్చే APK ఫైల్ డౌన్లోడ్ చేయవద్దని కోరారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలన్నారు.
News February 9, 2026
నెల్లూరులో ఎవరి దారి వారిదే..!

TDP లో సమిష్టి న్యాయకత్వం మసక బారుతోంది. ఇటీవల ఓ సీనియర్ నేత విషయంలో ఇదే నిజమవుతుందని తెలుస్తోంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి MLA సోమిరెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తూ తిట్ల పురాణం చేస్తున్నా తోటి TDP నేతలకు అది పట్టడం లేదు. సోమిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు, కాకాణిపై ఎదురుదాడికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అని పలువురు చర్చించుకుంటున్నారు.
News February 9, 2026
175 నియోజకవర్గాల ర్యాంకింగ్.. కావలి లాస్ట్.!

ఏపీలో వివిధ అంశాల్లో 175 నియోజకవర్గాల్లో వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది. A+ గ్రేడ్లో 21, A గ్రేడ్లో 153, B గ్రేడ్లో ఒక నియోజకవర్గం ఉన్నాయి. అలాగే, 90 % కంటే ఎక్కువ మార్కులు సాధించి A+ ప్లస్ గ్రేడ్ దక్కించుకున్నవి 21 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కావలి(78) చివరి నుంచి మూడోస్థానం, కందుకూరు(78) మార్కులతో రాష్ట్రంలో చివరి నుంచి నాలుగో స్థానానికి పడిపోయాయి.


