News May 18, 2024

నెల్లూరు: ఎన్నికల కౌంటింగ్ జరిగేది ఇక్కడే..! 

image

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ఓట్ల లెక్కింపు కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో జరగనుంది. ఇప్పటికే పార్లమెంటు స్థానంతో పాటు నెల్లూరు రూరల్, సిటీ, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను ప్రియదర్శిని కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.

Similar News

News December 13, 2024

ఏపీలో పౌర విమానయానం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి: వేమిరెడ్డి

image

ఏపీలో పౌర విమానయానం అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటి అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురువారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపాదించిన విమానాశ్రయాలు పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తెలియజేయాలన్నారు. ఏవియేషన్ ప్రాజెక్టుల ప్రయోజనం కోసం కేటాయించిన నిధులను తెలియజేయాలన్నారు. సహాయ మంత్రి మురళీధర్ సమాధానమిచ్చారు.

News December 12, 2024

సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు: తిరుపతి జేసీ

image

భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ శుక్రవారం సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో పాటు వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లె మండలాలకు మాత్రమే సెలవు వర్తిస్తుంది. నెల్లూరు జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

News December 12, 2024

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు కీలక పదవి

image

మాజీ మంత్రి, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు కీలక పదవి దక్కింది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పీఏసీ మెంబర్‌గా అనిల్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.