News January 12, 2026
నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్‌కి 105 అర్జీలు

నెల్లూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎస్పీ అజిత వేజెండ్ల బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 105 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిలో ఎక్కువగా చీటింగ్ కేసులకు సంభందించి అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉండి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులను కోరారు.
Similar News
News February 14, 2026
నెల్లూరు: రైలు కిందపడి ఒకరి మృతి

నెల్లూరు రైల్వే స్టేషన్లో తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు చనిపోయారు. ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి నాలుగో నెంబర్ ప్లాట్ ఫామ్ నుంచి మూడో నెంబర్‌కు వెళుతుండగా అకస్మాత్తుగా రైలు కదలడంతో రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడి వయస్సు 40-45 ఏళ్లు ఉంటుంది. ఎరుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని ఎస్సై తెలిపారు.
News February 13, 2026
మన నెల్లూరు కలెక్టర్ లవ్ స్టోరీ తెలుసా..?

మన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా ముస్సోరీలో శిక్షణలో ఉండగా 2013లో కృతికా(పల్నాడు కలెక్టర్) పరిచయమయ్యారు. ప్రాంతాలు వేరైనా ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో పరస్పరం ఇష్టపడ్డారు. తమ కెరీర్‌కు ప్రాధాన్యమిస్తూనే ముందుకు సాగారు. తల్లిదండ్రులను ఒప్పించి 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి రియాన్ష్(8), పాప అహిల్యా(18 నెలలు) ఉన్నారు. లవర్స్ డే నేపథ్యంలో తమ ప్రేమ బంధాన్ని ఆయన Way2Newsకు వివరించారు.
News February 13, 2026
కాకాణి కుమార్తెకు నోటీసులు

కోవూరు మండలంలో ఇటీవల మైనర్ బాలిక మృతి దుమారం రేపింది. ఈక్రమంలో ఆమె మృతిపై వైసీపీ నేతలు పలు ఆరోపణలు చేశారు. నిరాధార ఆరోపణలు చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 16వ తేదీ విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. బాలిక మృతి మీద ఆమె దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని రావాలని కోరారు.


