News March 31, 2025

నెల్లూరు: ఏప్రిల్ 2 నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ పద్ధతి ప్రారంభం

image

ఏప్రిల్ రెండవ తేదీ నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రారంభిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు తెలిపారు.

Similar News

News November 23, 2025

నెల్లూరు: దీపావళి స్కీం పేరుతో రూ.73 లక్షలు టోకరా..?

image

కనకదుర్గమ్మ దీపావళి ఫండ్స్ స్కీం పేరుతో విలువైన వస్తువులు, బంగారు ఇస్తామని ఆశ చూపి సుమారు రూ.73 లక్షల మేర టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గూడూరుకు చెందిన ప్రసాద్, పద్మావతి దంపతులు 3 రకాల స్కీముల పేరుతో నెలకు రూ.350, రూ.400, రూ.1200 చెల్లిస్తే కంచు బిందెతోపాటు, 20 రకాల విలువైన వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసి ఉడాయించడంతో మనుబోలు పోలీసులను ఆశ్రయించారు.

News November 23, 2025

కావలి: రైలు కింద పడి యువకుడి దుర్మరణం

image

కావలి జీఆర్‌పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొడవలూరు రైల్వే స్టేషన్ వద్ద సుమారు 20-25 ఏళ్ల వయసు గల యువకుడు రైలు కింద పడి దుర్మరణం చెందాడు. యువకుడు ఆరంజ్ కలర్ హాఫ్ హ్యాండ్ T షర్ట్, బ్లూ కలర్ కట్ బనియన్, బ్లూ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు కావలి జీఆర్‌పీ పోలీసులను సంప్రదించగలరు.

News November 23, 2025

నెల్లూరు: కీచక ఉపాధ్యాయుడి అరెస్ట్

image

వరికుంటపాడు(M) తూర్పు బోయమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జులై 1న పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ నుంచి ఉపాధ్యాయుడు పరారు కావడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. టీచర్ ఆచూకీ కోసం పోలీసులు గాలించి శనివారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.