News March 28, 2025
నెల్లూరు: ఐదుగురు ఎంపీటీసీలు సస్పెండ్

విడవలూరు మండలానికి సంబంధించిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను వైసీపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు ఆవుల శ్రీనివాసులు(రామచంద్రాపురం), అక్కయ్యగారి బుజ్జమ్మ(పెద్దపాళెం), వెందోటి భక్తవత్సలయ్య(వరిణి), ముంగర భానుప్రకాశ్(దంపూరు), చింతాటి జగన్మోహన్(అలగానిపాడు)ను సస్పెండ్ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు.
Similar News
News April 25, 2025
గణితంలోనే 3,934 మంది ఫెయిల్

ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలో 3,934 మంది విద్యార్థులు ఒక్క గణితంలోనే ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత సైన్సులో 2,555 విద్యార్థులు ఫెయిల్ కావడం గమనార్హం. గణితం ప్రశ్నా పత్రంలో లోపాలు ఉన్నప్పటికీ విద్యార్థులు ప్రయత్నం చేశారని, అయినా ఫలితాలు నిరాశ కలిగించాయని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రీ-వెరిఫికేషన్‌కు సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
News April 25, 2025
30 నుంచి VSUలో టోర్నమెంట్

కాకుటూరు దగ్గర ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఈనెల 30 నుంచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బందితో వీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి ప్రతినిధులు వస్తారని చెప్పారు. ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
News April 25, 2025
NLR: నేటి నుంచి నోషనల్ ఖాతాల స్పెషల్ డ్రైవ్

నెల్లూరు జిల్లాలో 95వేలకు పైగా ఉన్న నోషనల్ ఖాతాల పరిష్కారానికి ఈనెల 25 నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ తెలిపారు. 1,84,288 సర్వే నంబర్లలోని 95,065 నోషనల్ ఖాతాలకు సంబంధించి రోజూ జిల్లాలోని నాలుగు డివిజన్ల నుంచి రెండేసి మండలాల చొప్పున పరిశీలిస్తారు. రోజూ 8 మండలాల నోషనల్ ఖాతాలను పరిశీలించి రైతుల సమస్యలు పరిష్కరిస్తారు.