News August 20, 2024
నెల్లూరు: ఒక్కరోజే 330కు పైగా రిజిస్ట్రేషన్లు
నెల్లూరు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సోమవారం ఒక్కరోజే 330కి పైగా వివిధ రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత 3 నెలలుగా పదుల సంఖ్యలో జరిగిన రిజిస్ట్రేషన్లు.. సోమవారం మంచి రోజు కావడంతో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. నెల్లూరు ప్రధాన కార్యాలయంలో 80, స్టోన్ హౌస్ పేటలో 25, జిల్లాలోని మండల కేంద్రాల్లో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 225 కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.
Similar News
News September 10, 2024
సర్వేపల్లి: బాధితులకు పారిశ్రామికవేత్తల భారీ సాయం
వరద బాధితులను ఆదుకునేందుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలు భారీ సాయం ప్రకటించారు. రూ.2.97 కోట్ల విలువైన చెక్కులను సీఎం చంద్రబాబు నాయుడికు మంగళవారం అందజేశారు. జెమిని ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫాట్స్ కంపెనీ రూ.2 కోట్లు, ఎస్ఈఐఎల్ పవర్ ప్రాజెక్టు ప్రతినిధులు రూ.50 లక్షలు, పలు కంపెనీల ప్రతినిధులు కలిసి రూ.47 లక్షలను అందజేశారు. దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
News September 10, 2024
విజయవాడకు అండగా నిలిచిన నెల్లూరు
నెల్లూరు పారిశ్రామిక వేత్తలు పలువురు తమ మంచి మనసు చాటుకున్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకొనేందుకు తమ వంతు సాయం అందించారు. సోమిరెడ్డి సమక్షంలో జెమినీ ఎడిబుల్ ఆయిల్స్& ఫ్యాట్ లిమిటెడ్ రూ.2కోట్లు, పామాయిల్ పారిశ్రామిక వేత్తలు రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. విజయవాడ కలెక్టరేట్‌లో మంగళవారం చంద్రబాబుకు చెక్కు అందించారు.
News September 10, 2024
నాయుడుపేట: సముద్రంలో యువకుని మృతదేహం లభ్యం
వినాయక నిమజ్జనానికి వచ్చి తూపిలిపాలెం సముద్రంలో గల్లంతైన నాయుడుపేటకు చెందిన యువకుడు మునిరాజా (22) మృతదేహం మంగళవారం మధ్యాహ్నం లభ్యమయ్యింది. నిమజ్జనానికి సోమవారం నాయుడుపేట నుంచి వెళ్లిన యువకులలో ఫయాజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అతనికి స్నేహితుడైన ముని రాజా మృతదేహం కూడా మంగళవారం లభ్యమయింది. ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.