News August 19, 2024
నెల్లూరు: ఒక గేటు పెట్టలేని ప్రభుత్వం 5 ఏళ్లు పాలించింది: సీఎం

సోమశిల ప్రాజెక్టు సందర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు పోతే దానిని పెట్టకుండా 5 ఏళ్లు పాలించిందని విమర్శించారు. సోమశిల మరమ్మతులకు రూ. 95 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పుడున్న NDA ప్రభుత్వం ఎన్నికష్టాలు ఉన్నా అన్ని పనులు పూర్తి చేస్తామని సీఎం పేర్కొన్నారు.
Similar News
News October 27, 2025
భారీ వర్షాలు.. జిల్లాలో కంట్రోల్ రూం నంబర్లు ఇవే.!

☞ నెల్లూరు కలెక్టరేట్: 0861 2331261, 7995576699
☞ కందుకూరు సబ్ కలెక్టరేట్: 7601002776
☞ నెల్లూరు RDO ఆఫీసు: 9849904061
☞ ఆత్మకూరు RDO ఆఫీసు: 9100948215
☞ కావలి RDO ఆఫీసు: 7702267559
☞ ఆయా పరిధిలోని ప్రజలు ఇబ్బందులు ఉంటే ఈ నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు.
News October 27, 2025
నెల్లూరు: రేపు కూడా స్కూళ్లకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడీలకు సెలవును మరో రోజు పొడిగిస్తున్నట్లు నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ‘మెంథా తుఫాన్’ నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లతోపాటు అంగన్వాడీలకు సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం సైతం తుఫాన్ ప్రభావం ఉండనుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
News October 27, 2025
మొంథా ఎఫెక్ట్.. నెల్లూరుకు రూ.కోటి నిధులు

మొంథా తుపాన్ను ఎదుర్కునేందుకు నెల్లూరు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జిల్లాలో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు విడుదల చేసింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.


