News April 11, 2025
నెల్లూరు కలెక్టరేట్‌లో పోస్టర్ ఆవిష్కరణ

ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ సభ్యులు గురువారం కలెక్టర్ ఆనంద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. వారు రూపొందించిన “ప్రభుత్వ పాఠశాలలలో మీ పిల్లలను చేర్పించండి వారి బంగారు భవితకు బాటలు వేయండి” పోస్టర్‌ను కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్య అందుతుందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జేసీ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 9, 2026
175 నియోజకవర్గాల ర్యాంకింగ్.. కావలి లాస్ట్.!

ఏపీలో వివిధ అంశాల్లో 175 నియోజకవర్గాల్లో వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది. A+ గ్రేడ్లో 21, A గ్రేడ్లో 153, B గ్రేడ్లో ఒక నియోజకవర్గం ఉన్నాయి. అలాగే, 90 % కంటే ఎక్కువ మార్కులు సాధించి A+ ప్లస్ గ్రేడ్ దక్కించుకున్నవి 21 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కావలి(78) చివరి నుంచి మూడోస్థానం, కందుకూరు(78) మార్కులతో రాష్ట్రంలో చివరి నుంచి నాలుగో స్థానానికి పడిపోయాయి.
News February 9, 2026
వెట్టి చాకిరి నిర్మూలన పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్, ఎస్పీ

వెట్టి చాకిరి నిర్మూలన చట్టానికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా అజిత వేజెండ్ల ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. వెట్టి చాకిరి వంటి అమానుషమైన ఆచారాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు రూపొందించిన వెట్టి చాకిరి నిర్మూలన చట్టము- 1976 అమల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 09 తేదీని వెట్టి చాకిరి నిర్మూలన దినంగా పాటించబడిందన్నారు.
News February 9, 2026
నెల్లూరు: CIపై ఆరోపణలు.. కానిస్టేబుల్ సస్పెండ్

తనను ఉదయగిరి సీఐ N.వెంకట్రావు <<19088594>>వేధిస్తున్నారని <<>>సీతారామపురం మహిళా కానిస్టేబుల్ జ్యోతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమెకు నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆమెను సస్పెండ్ చేశారు. ‘ఉన్నతాధికారి పర్మిషన్ లేకుండా ప్రెస్‌మీట్ నిర్వహించడం రూల్స్‌కు విరుద్ధం. సీఐపై నిరాధార ఆరోపణలు చేశారు. క్రమశిక్షణ చర్యల కింద ఆమెను సస్పెండ్ చేశాం’ అని SP పేర్కొన్నారు.


