News April 10, 2024

నెల్లూరు కలెక్టర్‌కే ఎంపీ టికెట్

image

ఒకప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వ్యక్తికే ఇక్కడి ఎంపీ టికెట్ లభించింది. ఆయన ఎవరో కాదు కొప్పుల రాజు. IAS అధికారి అయిన రాజు నెల్లూరు కలెక్టర్‌గా 1988 నుంచి 1992 వరకు పని చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. ఆ పార్టీలో కీలక పదవులు పోషించారు. రాహుల్‌కు దగ్గర మనిషి. గతంలో నెల్లూరులో పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనకే కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ టికెట్ కేటాయించింది.

Similar News

News March 18, 2025

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు వేగవంతం చేయండి: సూర్య

image

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం ఇంజనీరింగ్, హౌసింగ్, టిడ్కో విభాగాల వారితో మీటింగ్ నిర్వహించారు. ఎల్&టి ఇంజనీరింగ్ కంపెనీ వారికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు వేగవంతంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని ప్రతినిధులకు తెలిపారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలన్నారు.

News March 17, 2025

నెల్లూరు జిల్లాలో 144 సెక్షన్ అమలు

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మరికాసేపట్లో 174 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు SP తెలిపారు. 33,434 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు.

News March 17, 2025

పేట్రేగుతున్న సైబర్ నేరగాళ్లు.. రూ.5కోట్లు దోచేశారు

image

నెల్లూరు జిల్లాలో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. నెల రోజుల్లో దాదాపు రూ.5కోట్లు దోచేసినట్లు సమాచారం. డాక్టర్లు, ఆడిటర్లు, రిటైర్డ్ టీచర్లే లక్ష్యంగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్‌లు అంటూ భయపెడుతూ యథేచ్చగా అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల CBI అధికారినంటూ ఓ వ్యక్తి వద్ద కోటికి పైగా దోచేసిన విషయం తెలసిందే. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

error: Content is protected !!