News February 25, 2025
నెల్లూరు కలెక్టర్ ఆగ్రహం

నెల్లూరు జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అనధికారికంగా నియామకాలు జరిగాయి. నిన్న కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ డేలో పలువురు ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనధికారిక నియామకాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని.. తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని అధికారులను హెచ్చరించారు.
Similar News
News November 7, 2025
వందేమాతరాన్ని ఆలపించిన నెల్లూరు కలెక్టర్

స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన దేశభక్తి గేయం వందేమాతరం అని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా కొనియాడారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్లో వందేమాతరం గేయాన్ని శుక్రవారం ఉదయం ఆలపించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వందేమాతరం గేయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.
News November 7, 2025
నెల్లూరు: కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు

నెల్లూరు జిల్లా ఉదయగిరి(M) గంగిరెడ్డిపల్లి జగనన్న లేఅవుట్ కాంట్రాక్టర్లపై లబ్ధిదారులతో కలిసి హౌసింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దేవండ్ల పిచ్చయ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీ ఏరియాలోనూ కాంట్రాక్టర్లు ఇలాగే చేశారా?
News November 7, 2025
నెల్లూరు: లోకేష్ వార్నింగ్ ఎవరికో..?

దగదర్తిలో నారా లోకేశ్ ఇచ్చిన వార్నింగ్ కలకలం రేపుతోంది. మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కించపరుస్తూ పోస్టులు పెట్టడాన్ని గమనించాం. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం.. యాక్షన్లో చూపిస్తాం’ అన్నారు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారనేది టీడీపీలో కాక రేపుతోంది.


