News November 28, 2024

నెల్లూరు: కానిస్టేబుల్ సూసైడ్.. UPDATE

image

వెంకటగిరికి చెందిన కానిస్టేబుల్ చిరంజీవి(29) విజయవాడలోని ఇంటెలిజెన్స్ విభాగంలో APSPగా పనిచేస్తున్నారు. ఆయన యనమలకుదురులో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి భార్య గాయత్రితో గొడవపడడంతో ఆమె పక్కింటికి వెళ్లింది. బుధవారం ఉదయం ఆమె వచ్చి చూడగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 15, 2025

వాహనదారులకు అవగాహన కల్పించండి: SP

image

రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చని నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.

News November 15, 2025

సోమశిల జలాశయం నుంచి నీటి విడుదల

image

పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మ. 2 గంటలకు సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారని అన్నారు. పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు, గ్రామాలలో దండోరా వేయించి ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసి, వారిని అప్రమత్తం చేయాలని తెలిపారు. చేపల వేటకు, ఈతకు ఎవరిని వెళ్లకుండా జాగ్రతగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

News November 15, 2025

నెల్లూరు జిల్లాలోని అనధికార కట్టడాలకు భలే ఛాన్స్..

image

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో బిల్డింగ్ ప్లాన్ లేకుండా, ప్లాన్ ఉన్నా అనుమతికి మించి కట్టిన భవనాలకు ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన BPS అవకాశం ఓ వరం అవుతుంది. ఈ ఏడాది ఆగస్ట్ 31 లోపు నిర్మించిన అలాంటి భవనాలను క్రమబద్ధీకరించడానికి ఇదో చక్కని అవకాశం. నెల్లూరు కార్పొరేషన్ తోపాటు కందుకూరు, కావలి, ఆత్మకూరు మున్సిపాలిటీలలో అలాంటి భవనాలు భారీగా ఉన్నాయని అంచనా. 2019 తరువాత ప్రభుత్వం మళ్లీ ఈ అవకాశం కల్పించింది.