News November 16, 2024

నెల్లూరు: కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

image

చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలోని అల్లిపురం గిరిజన కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సొన కాలువలో పడి  అల్లిపురం గిరిజన కాలనీకి చెందిన నాగేంద్రమ్మ(11), చింతాలయ్య(11) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News December 9, 2024

నెల్లూరు: 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

image

నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియకు 4వ సారి కలెక్టర్ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 11న నోటిఫికేషన్ విడుదల చేస్తామని కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. జిల్లాలోని ఇరిగేషన్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి 6 ప్రాజెక్టు కమిటీలు, 13 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. వీటితోపాటు 490 వాటర్ యూజర్స్ అసోసియేషన్లు, 3698 టీసీలకు ఎన్నికలు జరుగుతాయి.

News December 9, 2024

వ్యభిచారం చేయిస్తున్న నెల్లూరు జిల్లా వాసి అరెస్ట్

image

నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన శ్రీరాములు, తిరుపతిలోని ఎర్రమిట్టకు చెందిన ఓ మహిళ తిరుపతి రైల్వేకాలనీలో ఇంటిని బాడుగకు తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. కోస్తా అమ్మాయిలు దొరకగా.. వాళ్లను హాస్టల్‌కు తరలించారు. మహిళతో పాటు శ్రీరాములును అరెస్ట్ చేశామని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ తెలిపారు.

News December 9, 2024

నెల్లూరు: ఆ నలుగురి చివరి ఫొటో ఇదే..!

image

పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసులు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వీరంతా తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా కారు చెట్టు ఢీకొని చనిపోయారు. కొండగట్టులో వాళ్లు తీసుకున్న చివరి ఫొటో ఇదే. ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు కన్నుమూయడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు.