News January 29, 2025
నెల్లూరు: కూతురిని రూ. 25 వేలకు అమ్మిన కసాయి తండ్రి

కూతురిని రూ. 25 వేలకు అమ్మిన కసాయి తండ్రి రమణయ్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన రమణయ్య దంపతులకు ముగ్గురు మగ పిల్లలు, ఏడుగురు ఆడపిల్లలు సంతానం కలరు. చిత్తూరు జిల్లాలో రమణయ్య కుటుంబం బాతులు మేపుతుండేవారు. భార్య అనారోగ్యం కావడంతో తన ఐదో కూతురు మల్లిక(10)ను నగరికి చెందిన బాలాజీకి రూ.25 వేలకు అమ్మాడు. చిన్నారిని గ్రామస్థులు రక్షించి పోలీసులకు అప్పగించారు.
Similar News
News February 13, 2025
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. నెల్లూరు జిల్లాలో చెక్‌పోస్టుల ఏర్పాటు

నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకకుండా చర్యలు తీసుకున్నామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ నాయక్ తెలిపారు. మనుబోలు పశు వైద్యశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో ఆరు చోట్ల చెక్‌పోస్ట్‌ల నుంచి ఇతర జిల్లాల నుంచి కోళ్ల రవాణాను అడ్డుకుంటామన్నారు. ఉడికించిన మాంసం, గుడ్లను నిర్భయంగా తినవచ్చు అన్నారు.
News February 13, 2025
నెల్లూరు జిల్లాలో మరో రేప్ అటెంప్ట్!

వెంకటాచలం మండలంలోని విద్యార్థినిపై రేప్ అటెంప్ట్ జరిగిన విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్‌లో చదివే విద్యార్థులే ఆ విద్యార్థినిపై లైంగిక దాడి చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 13, 2025
42 మంది నెల్లూరు కార్పొరేటర్లకు నోటీసులు

ఇటీవల నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో 42 మంది వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేశారు. అయితే 42 మంది కార్పొరేటర్లు విప్ ధిక్కరించారు. ఈ నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ వారికి నోటీసులు జారీ చేశారు. జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన కరిముల్లాకు కాకుండా కూటమి బలపరిచిన అభ్యర్థికి 40 ఓట్లు వేయగా, ఇద్దరు ఓటింగుకు పాల్గొనలేదు.