News March 21, 2025
నెల్లూరు: కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని 12 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 40 మందికి, ఇంటర్ ఫస్టియర్లో 40 మందికి ఒక్కో విద్యాలయానికి కేటాయించినట్లు తెలిపారు. అలాగే 7,8,9,10 తరగతులతో పాటు ద్వితీయ ఇంటర్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 29, 2025
నెల్లూరులో Photo Of The Day

నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రాత్రి, పగలు, వర్షం అనే తేడా లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. నెల్లూరు రూరల్ కొండ్లపూడిలోని పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆ ఇద్దరూ అక్కడే భోజనం చేసి వారికి భరోసా కల్పించారు.
News October 28, 2025
నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీలు, జానియర్ కళాశాలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. విధిగా సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 28, 2025
శ్రీహరికోట: షార్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నందు సైంటిస్ట్/ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ – బి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. వివిధ విభాగాలలో మొత్తం 141 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు https://apps.shar.gov.in/sdscshar/result1.jsp వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 11.


