News March 19, 2024
నెల్లూరు: కొత్త స్కూటర్ ఇవ్వాలని కోర్టు ఆదేశం

నెల్లూరుకు చెందిన సురేశ్ బాబు 2022లో ఓ ఎలక్ట్రికల్ స్కూటర్ కొన్నారు. మైలేజీ రాకపోగా పది రోజులకే సెన్సార్ పనిచేయలేదు. బ్రేకులు ఫెయిలయ్యాయి. మరమ్మతులు చేయాలని లేదా కొత్త స్కూటర్ ఇవ్వాలని పలుమార్లు బాధితుడు కోరినా కంపెనీ నుంచి స్పందించక పోవడంతో బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. 45 రోజుల్లో కొత్త స్కూటర్ ఇవ్వడంతో పాటు రూ.5 వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది.
Similar News
News April 20, 2025
నెల్లూరు: హెల్త్ ఆఫీసర్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ

నెల్లూరు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ చైతన్య ఆదివారం బుల్లెట్ వాహనంపై పర్యటించి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. ధనలక్ష్మిపురం, నారాయణ మెడికల్ కాలేజ్ రోడ్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. మస్టర్లను పరిశీలించి శానిటేషన్ సెక్రటరీలకు సూచనలు చేశారు. కార్మికుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో ఆదివారం కూడా పనికి వచ్చే కార్మికుల సంఖ్య తగ్గకుండా చూడాలని ఆదేశించారు.
News April 20, 2025
మనుబోలు: పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

మనుబోలు మండలంలోని వడ్లపూడి వద్ద ఆదివారం కారు బోల్తా పడి అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఐదుమంది ఉన్నారు. వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. పొదలకూరు మండలం బిరదవోలు రాజుపాలెంకు చెందిన వారు కొత్త కారును కొనుగోలు చేసి గొలగమూడిలో పూజలు చేయించుకొని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
News April 20, 2025
NLR: చెట్టును ఢీకొట్టిన బైక్.. యువతి మృతి

నెల్లూరు జిల్లాలో ఉదయాన్నే జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లి సమీపంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై ఓ బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న యువతి అక్కడికక్కడే మృతిచెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.