News May 22, 2024
నెల్లూరు: కోళ్ల పంపిణీపై అధికారుల విచారణ

ఎన్నికల పోలింగ్‌కు మందు రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగానెల్లూరులో ఓటర్లకు ఓ పార్టీ నేతలు కోళ్లు పంపిణీ చేశారని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపించారు. ఈఘటనపై మొదట గ్రామంలో విచారణ జరిపిన అధికారులు అలాంటిదేమీ లేదని తేల్చారు. పునర్విచారణ జరపాలని కలెక్టర్‌తో పాటు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎంపీడీఓ, ఎస్ఐ, ఇతర పోలీస్ సిబ్బంది మంగళవారం గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News October 27, 2025
నెల్లూరు: డివిజన్లవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను నేపథ్యంలో జిల్లా కలెక్టరు కార్యాలయంతోపాటు అన్ని రెవెన్యూ డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు.
*జిల్లా కలెక్టరేట్ కంట్రోలు రూం నెంబర్లు: 0861 2331261, 7995576699
*కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, : 7601002776
*ఆర్డీవో కార్యాలయం, నెల్లూరు : 9849904061
*ఆర్డీవో కార్యాలయం, ఆత్మకూరు : 9100948215
*ఆర్డీవో కార్యాలయం, కావలి : 7702267559.
News October 27, 2025
నెల్లూరు SP కార్యాలయం నుంచి కీలక అప్డేట్.!

ప్రతి సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమన్ని సోమవారం రద్దు చేస్తున్నట్లు నెల్లూరు SP అజిత తెలిపారు. మోంతా తుఫాన్ కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బాదితులు ఎవ్వరూ జిల్లా కేంద్రానికి రావొద్దని అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
News October 26, 2025
నెల్లూరు జిల్లాలో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు పడునున్న నేపథ్యంలో రేపు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. అంతే కాకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి RIO వర ప్రసాదరావు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు కూడా రేపు సెలవు ప్రకటించారు.


