News June 22, 2024
నెల్లూరు: గునపాటిపాలెంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

చిట్టమూరు మండలం గుణపాటిపాలెం గ్రామం నందు గల స్వర్ణముఖి నది పంట కాలవలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గుర్తించి సచివాలయం సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు చిట్టమూరు పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందజేశారు. ఆ మృతదేహాన్ని బయటకి తీసి నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News July 9, 2025
నెల్లూరు రొట్టెల పండగకు 10 లక్షల మంది భక్తులు హాజరు

నెల్లూరు రొట్టెల పండుగకు ఇప్పటివరకు 10 లక్షల మంది భక్తులు హాజరైనట్లు జిల్లా అధికారులు అంచనా వేశారు. మంగళవారం ఒక రోజే 4 లక్షల మందికి పైగా దర్గాను దర్శించుకున్నట్లు తెలిపారు. ఎండ బాగా ఉన్నప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
News July 9, 2025
ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు..!

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్దదుమారం రేపాయి. తెలుగు మహిళలు పలుచోట్ల ఆందోళనలు చేసి ప్రసన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న ఉదయం కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ప్రసన్నపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. తనపై హత్యాయత్నం చేశారని ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా దానిపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.
News July 9, 2025
నల్లపురెడ్డిపై మహిళా కమిషన్ ఫిర్యాదు

YSRCP మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజను కలిసి కార్పొరేటర్ ఉషారాణి ఫిర్యాదు చేశారు. ప్రశాంతి రెడ్డిపై చేసిన అవమానకర వ్యాఖ్యలు దౌర్జన్యంగా ఉన్నాయని విమర్శించారు. నల్లపురెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.