News April 2, 2025
నెల్లూరు: గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని నెల్లూరు అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025 -26 సంవత్సరానికి గాను 5, 6, 7 ,8వ తరగతులలో ప్రవేశం పొందేందుకు అర్హులు ఆన్లైన్లో https://aprs.apcfss.in దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ. మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకొవాలన్నారు.
Similar News
News April 4, 2025
వైసీపీ నేతలను జైలుకు పంపడమే వారి లక్ష్యం: మేరిగ

రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలోనూ టీడీపీ నాయకులు కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళి మండిపడ్డారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్యాయంగా, అక్రమంగా వైసీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు. ఎంతో సౌమ్యుడిగా, మంచి పేరున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టటం దారుణమన్నారు.
News April 4, 2025
వెబ్సైట్లో సీనియారిటీ ఉపాధ్యాయుల తుది జాబితా

వెబ్సైట్లో ఉపాధ్యాయుల సీనియారిటీ తుది జాబితాను అందుబాటులో ఉంచినట్లు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు తెలిపారు. ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో పాటు, ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ వారీగా పదోన్నతి జాబితాను కూడా అందుబాటులో ఉంచామన్నారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 11వ తేదీలోగా తెలపాలన్నారు.
News April 4, 2025
విద్యుత్ సమస్యలపై నెల్లూరు కలెక్టరుకు ఫిర్యాదు

దుత్తలూరు మండలం నందిపాడు, వెంకటంపేట గ్రామాల్లో గురువారం కలెక్టర్ ఓ.ఆనంద్ ఎదుట ప్రజలు విద్యుత్ సమస్యలపై ఏకరువు పెట్టారు. లోవోల్టేజీ సమస్య తీవ్రంగా ఉందని, శిథిల స్తంభాలు గాలులకు నేలకొరిగి ఎప్పుడు ఏలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.