News September 25, 2024
నెల్లూరు: గుళికలు మింగి యువకుడి ఆత్మహత్య
జీవితంపై విరక్తి పుట్టి గుళికలు మింగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాపూరు మండలంలో చోటుచేసుకుంది. రాపూరు పంచాయతీ పరిధిలోని సైదాదు పల్లి గ్రామానికి చెందిన పానుగోటి పెంచల నరసయ్య(35) బుధవారం గుళికలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా బంధువులు వైద్యశాలకు తరలించారు. మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహానికి పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు.
Similar News
News October 6, 2024
కండలేరు జలాశయంలో మత్స్యకారుడు గల్లంతు
రాపూరు మండలం కండలేరు జలాశయం ఓబులాయపల్లి సమీపంలో చేపల వేటుకు వెళ్లిన చెంచయ్య అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేపలవేట సాగించి జీవనం సాగిస్తుంటాడు. చెంచయ్య ఆచూకీ కోసం కండలేరులో స్థానికులు గాలింపు వేగవంతం చేశారు.
News October 6, 2024
నెల్లూరు: ఈ నెల 9th లాస్ట్ డేట్
మద్యం దుకాణాలకు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవాలని నెల్లూరు 1 టౌన్ ఎక్సైజ్ సీఐ రమేశ్ బాబు కోరారు. టెండర్లలో ఎంతమందైనా పాల్గొన వచ్చునని, ఒక వ్యక్తి ఒక షాప్‌కి ఎన్ని దరఖాస్తులైనా వేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉందని, దరఖాస్తు వివరాలకు https://hpfsproject.com/ సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై లు ప్రభాకర్ రావు, శ్రీధర్, మురళి కృష్ణ ఉన్నారు.
News October 6, 2024
నెల్లూరు: దసరాకు ఊర్లకు వెళ్లేవారికి హెచ్చరిక
నెల్లూరు జిల్లాలో దసరా పండుగ రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాలు జరగకుండా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను వినియోగించుకోవాలని ఎస్పీ జి క్రిష్ణ కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. LHMS యాప్, 9440796383, 9392903413 నంబర్ లకు, స్థానిక పోలీసులను సంప్రదించి LHMS సేవలు ఉచితంగా పొందవచ్చన్నారు. డబ్బు, విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచి వెళ్లకూడదని బ్యాంకులో ఉంచుకోవాలన్నారు.