News August 28, 2024
నెల్లూరు: ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

రాపూరు మండలం చిట్వేల్ ఘాట్ రోడ్డు సమీపంలోని ఆరో మైలు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు, బైకు, ఆర్టీసీకి చెందిన పెళ్లి బస్సు ఒక్కసారిగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వెంకటాచలం మండలం కుచ్చెళ్లపాడుకు చెందిన వీరేపల్లి వెంకటరత్నయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News January 7, 2026
NLR: బధిర విద్యార్థులకు ఆడియో మీటర్

సూళ్లూరుపేటకు చెందిన ఎన్ఆర్ఐ యస్వంత్ బధిర విద్యార్థుల కోసం ఆడియో మీటర్ అందజేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో బధిరుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక పాఠశాల విద్యార్థులకు రూ.82 వేల విలువైన దీనిని సమకూర్చారు. దీనికి నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేశారు. యశ్వంత్‌ను కలెక్టర్ అభినందించారు.
News January 7, 2026
నెల్లూరు: ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు

ఎవరైనా డీలర్లు కృత్రిమ ఎరువుల కొరత సృష్టించినా, MRP ధరలకు మించి విక్రయించినా, ఎరువులను దారి మళ్లించినా చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారిణి P.సత్యవాణి హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 62,928 మెట్రిక్ టన్నులు యూరియా విక్రయించారన్నారు. ప్రస్తుతం 18,025 మెట్రిక్ టన్నుల యూరియా ప్రైవేటు డీలర్స్, కోపరేటివ్ సొసైటీలు, RSK, మార్క్ పెడ్ గోడౌన్లో నిల్వ ఉందని చెప్పారు.
News January 7, 2026
సోమిరెడ్డి అవినీతి రూ.100కోట్లు: కాకాణి

సోమిరెడ్డి నీతిమాలిన మాటలు విని భవిష్యత్తులో ఉద్యోగులు ఇబ్బంది పడొద్దని మాజీ మంత్రి కాకాణి సూచించారు. ‘సోమిరెడ్డి చెప్పారనే వెంకటాచలం సర్పంచ్‌ను డీపీవో శ్రీధర్ రెడ్డి తొలగించారు. పోలీసులు లేకుండా MLA గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు కుక్కను కొట్టినట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క ఇరిగేషన్ శాఖలోనే సోమిరెడ్డి రూ.100కోట్ల అవినీతి చేశారు’ అని కాకాణి ఆరోపించారు.


