News August 29, 2024
నెల్లూరు: ఘోర ప్రమాదంలో ముగ్గురి మృతి UPDATE

కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు పాళ్య గేటు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు వాసులు ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. వారందరూ కూడా మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, భార్య పుష్ప, కుమారుడు శ్రీకాంత్ గా గుర్తించారు. విహహానికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 18, 2025
నెల్లూరు: సముద్రపు వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతు

సముద్రపు వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతైన ఘటన TP గూడూరు(M)లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకన్నపాలెం పట్టపుపాలెం గ్రామానికి చెందిన కే.వెంకటేశ్వర్లు అనే మత్స్యకారుడు వేటకు వెళ్లి తీరానికి చేరుకోలేదు. తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకూరుపేట(M), కొరుటూరు సమీపంలో మృతదేహం కొట్టుకొచ్చింది. తోటపల్లి గూడూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News February 18, 2025
అనుమతి ఉన్న లేఅవుట్లనే కొనండి: మంత్రి నారాయణ

అనుమతి ఉన్న లే అవుట్ల వివరాలను సంబంధిత వెబ్ సైట్‌లో పొందుపరుస్తామని, వాటినే కొనుగోలు చేయాలని మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో నిబంధనలను ప్రజలకు అనుకూలమైన విధంగా సడలించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
News February 17, 2025
10వ తరగతి పరీక్షలపై డివిజన్ స్థాయిలో సమీక్ష

10వ తరగతి పరీక్షలపై 19, 20 తేదీల్లో డివిజన్ స్థాయిలో సమీక్ష నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి నెలలో జరగనున్న 10వ తరగతి పరీక్షలపై 19 వ తేదీన కందుకూరు, కావలి డివిజన్లకు, 20వ తేదీన నెల్లూరు, ఆత్మకూరు డివిజన్లకు ఆయా ప్రాంతాల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి డిపార్ట్మెంటల్, చీఫ్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.