News August 29, 2024
నెల్లూరు: ఘోర ప్రమాదం..ముగ్గురి మృతి

కర్ణాటక, ఆంధ్ర సరిహద్దుపాళ్య గేటు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో పన్నెండు మంది గాయపడ్డారు. చిత్తూరు నుంచి చింతామణికి వస్తున్న టెంపో -బెంగుళూరు నుంచి కడప హైవే మార్గంలో వెళుతున్న కారును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీకాంత్ , శ్రీనివాసులు , పుష్ప అక్కడికక్కడే చనిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
Similar News
News November 9, 2025
తల్లి క్షణికావేశం.. పిల్లల పాలిట యమపాశమై.!

ఓ తల్లి క్షణికావేశం ఇద్దరు పిల్లల పాలిట <<18236870 >>మృత్యుపాశ<<>>మైంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మాతృమూర్తే తనతోపాటూ బిడ్డలను కాటికి తీసుకెళ్లింది. సూళ్లూరుపేట(M)లో వరలక్ష్మి(24) పిల్లలోసహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు మాధవయ్యతో ఆరేళ్ల క్రితం వివాహం అయింది. కొన్నేళ్లుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల భర్త వరలక్ష్మిని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.
News November 8, 2025
ఉలవపాడు: చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

ఉలవపాడు మండలంలోని చాకిచర్ల పెద్ద పట్టపుపాలెంకు చెందిన యువకుడు శనివారం సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. SI అంకమ్మ తెలిపిన వివరాలు ప్రకారం.. పెదపట్టపుపాలెంకు చెందిన వాయిల చంద్రయ్య, ఆయన కుమారుడు రాజు ఉదయం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి వస్తుండగా సముద్రపు అలల ధాటికి బోటు తిరగబడింది. ఆ ఘటనలో రాజు చనిపోయినట్లు తెలిపారు.
News November 8, 2025
NLR: 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర

నెల్లూరు జిల్లా జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించే ఈ యాత్ర జరగనుంది. వాల్ పోస్టర్లను నెల్లూరులో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్సీలు మాధవరెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు.


