News February 17, 2025

నెల్లూరు: చెల్లిని చూసేందుకు వెళ్తూ.. అన్న స్పాట్ డెడ్

image

చెల్లిని చూసేందుకు వెళ్లిన అన్న రోడ్డుప్రమాదంలో మృతి చెందిన ఘటన మనుబోలు(M), కొమ్మలపూడి సమీపంలో జరిగింది. ఏర్పేడు(M), బండారుపల్లికి చెందిన రాజేశ్ (35), తన ఫ్రెండ్ మునిశేఖర్‌తో కలిసి చెల్లిని చూసేందుకు బైకుపై నెల్లూరు నుంచి గ్రామానికి వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈఘటనలో రాజేశ్ దుర్మరణం చెందగా, మునిశేఖర్‌ తీవ్రంగా గాయపడగా గూడూరుకు తరలించారు. SI శివ రాకేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 17, 2026

శ్రీకాళహస్తి గుడిలో భారీ మార్పులు ఇవే..!

image

శ్రీకాళహస్తి గుడిలో జరిగే రాహుకేతు పూజల్లో భారీ మార్పులు చేశారు. ప్రారంభం టికెట్ రూ.500 ఉండగా దాన్ని రద్దు చేశారు. రూ.750, రూ.1500, రూ.2500 యథావిధిగా కొనసాగుతాయి. రూ.5వేల టికెట్‌ను రూ.6వేలకు పెంచారు. శ్రీకాళహస్తి లోకల్ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి బుధవారం రూ.100లకే 2వేల మందితో సామూహికంగా రాహు కేతు పూజ చేయిస్తారు.

News April 17, 2026

నెల్లూరు: వాట్సాప్‌లో ఒక్క క్లిక్.. రూ.2.58 లక్షలు హాంఫట్

image

వాట్సాప్‌లో ‘సేవింగ్స్ ఆన్‌లైన్ మార్కెటింగ్’ పేరుతో వచ్చిన సందేశాన్ని క్లిక్ చేసిన ఓ యువతి రూ. 2.58 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన నవబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నితేశ్ అనే వ్యక్తి ఓ యువతికి పంపిన APK ఫైల్‌ను ఓపెన్ చేయగానే ఆమె బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. గుర్తుతెలియని లింకులు, ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.