News December 30, 2024
నెల్లూరు: ‘జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’

సెకీతో ఒప్పందం కుదుర్చుకున్న మాజీ సీఎం జగన్ 30 ఏళ్లు పూర్తయ్యేసరికి ముత్తాత అవుతారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు టీడీపీ ఆఫిస్లో ఆదివారం ఆయన మాట్లాడారు. అవినీతిలో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన జగన్ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలోనే జగన్ రెడ్డిలా అవినీతికి పాల్పడిన ముఖ్యమంత్రి ఎవ్వరు లేరని ఆయన దుయ్యబట్టారు.
Similar News
News November 14, 2025
ప్రారంభం కానున్న జెండర్ రిసోర్సు సెంటర్

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోవూరు, గుడ్లూరు, వెంకటాచలం, పొదలకూరు, కావలి, కలిగిరి, ఆత్మకూరు, రాపూరు మండలాల్లో ఈ నెల 20లోగా జెండర్ రిసోర్సు సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మహిళా ప్రతినిధులే ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. లైంగిక–వరకట్న వేధింపులు, బాల్య వివాహాలు, హింస వంటి సమస్యలపై కౌన్సెలింగ్, న్యాయం, తక్షణ సాయం అందిస్తారు. ఒక్కో కేంద్రానికి రూ.5 లక్షలు మంజూరు చేశారు.
News November 14, 2025
నెల్లూరు: KG మటన్ రూ.500.. బారులు తీరిన జనాలు

ఆఫర్స్ పెట్టీ కస్టమర్స్ని ఆకట్టుకోవడం ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనే నెల్లూరులోని బీవీ నగర్లో జరిగింది. ఓ మటన్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా కిలో మటన్ 500 రూపాయలే అని బోర్డ్ పెట్టడంతో చుట్టు పక్కల జనాలు అందరూ బారులు తీరారు. మార్కెట్లో 1000 రూపాయలకు దొరికే మటన్ రూ.500కి వస్తుండటంతో ఆ షాప్ వద్దకు జనాలు క్యూ కట్టారు. దీంతో ఆ ప్రాంతం కాస్త రద్దీగా మారింది.
News November 14, 2025
నెల్లూరు: 2 రోజుల పోలీస్ కస్టడీకి కిలాడి లేడీ డాన్ అరుణ

నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న కిలాడి లేడీ డాన్ అరుణ రెండు రోజుల కస్టడీ నిమిత్తం గురువారం విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై, అంగన్వాడి పోస్టులు ఇప్పిస్తామంటూ మోసగించినట్లు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు కస్టడీలో తీసుకుని విజయవాడకు తరలించారు.


