News June 15, 2024
నెల్లూరు జట్టుపై అనంతపురం జట్టు విజయం
ఎంకే దత్తారెడ్డి (122) వీర విహారం చేయడంతో సౌత్‌జోన్ అంతర్ జిల్లా అండర్-23 క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం అనంత క్రీడా గ్రామంలో ప్రారంభమైన వన్‌డే పోటీలో నెల్లూరు జట్టును 39 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అనంత జట్టు దత్తారెడ్డి శతకంతో 25 ఓవర్లలో 9 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. నెల్లూరు జట్టు 23.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది.
Similar News
News September 18, 2024
ఈ పండుగ అనంతపురం జిల్లాకే పరిమితం!
అనంతపురం జిల్లాలో నేడు మాల పున్నం జరుపుకుంటున్నారు. మహాలయ పౌర్ణమి పండుగను పల్లె ప్రజలు ‘మాల పున్నం’ అంటారు. ఈ పండుగ వచ్చే నాటికి పొలంలో విత్తనాలు వేసి ఉంటారు. ఏటా ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరులో జరుపుకుంటారు. ఇది మాంసాహార పండుగ. ఈరోజున సాయంత్రం పూట కోలాట వేషాలు, కోళ్ల పందేలు కాలక్షేపం కోసం సరదాగా ఆడతారు. ప్రత్యేకంగా హరిజనులు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. రాష్ట్రంలో మరెక్కడా మాల పున్నమిని జరుపుకోరు.
News September 18, 2024
బెంగళూరు-ధర్మవరం ప్యాసింజర్ రైలు అనంతపురం వరకు పొడిగింపు
బెంగళూరు నుంచి ధర్మవరం వరకు నడుస్తున్న 06515/06516 ప్యాసింజర్ రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారి బీఎస్ క్రిస్టోఫర్ ఆదేశాలు జారీచేశారు. సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం మీదుగా అనంతపురం వెళ్తుందని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వినతి మేరకు పొడిగించినట్లు తెలిపారు.
News September 18, 2024
జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
అనంతపురం జిల్లాను దేశంలో ప్రథమ స్థానంలో ఉండటానికి కావలిసిన అని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏపీఎంఐపీ పథకం పైన సమీక్షసమావేశం నిర్వహించార. రాష్ట్ర స్థాయి డ్రిప్ కంపెనీ ప్రతినిధులు, జిల్లా వ్యవసాయ, మైక్రో ఇరిగేషన్, ఉద్యానవన, పట్టు పరిశ్రమ తదితరులతో నిర్వహించారు.