News April 11, 2024
నెల్లూరు: జనసేనలో కీలక నేతగా ఎదిగినా..

చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు రూరల్ మండలం కలివెలపాళేనికి చెందిన వారు. NRI అయిన ఆయన జనసేన ఆవిర్భావంలోనే పార్టీలో చేరారు. కీలక విభాగమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిన మనుక్రాంత్ ఈ ఎన్నికల్లో సిటీ సీటు ఆశించారు. కీలకనేతగా ఉన్నా కేడర్ తో కనెక్ట్ కాలేకపోయారని విమర్శలు ఉన్నాయి.
Similar News
News September 14, 2025
నెల్లూరు: కూలితే.. తల బద్దలే..!

నెల్లూరు ప్రసూతీ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో సోలార్ లైటింగ్ పోల్ పక్కకు ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. నిత్యం వండలాది మంది రోగులు వచ్చే ఆసుపత్రి ఆవరణలో ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంది. కానీ ఆసుపత్రి సిబ్బంది, అధికారులకు ఈ దృశ్యం కనిపించడం లేదా అన్నది ప్రశ్నగా ఉంది. ఇకనైనా స్పందించకపోతే ఎవరిపైనా అయినా పడిపోయే అవకాశం ఉంది. పెనుప్రమాదం జరగక ముందే దాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
News September 14, 2025
ఉలవపాడు: కరేడులో టెన్షన్..టెన్షన్

ఉలవపాడు(M) కరేడులో ఆదివారం అంతటా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆంక్షల నడుమ బోడె రామచంద్ర యాదవ్ మీటింగ్ జరగాల్సి ఉండటంతో పరిణామాలు ఎలా దారి తీస్తాయో అన్న టెన్షన్ అందరిలో ఏర్పడింది. జులై 29న జరిగిన హైవే దిగ్బంధం కార్యక్రమంలో కూడా బోడె రామచంద్ర వెంట అనూహ్యంగా వేలాది మంది కరేడు ప్రజలు దూసుకొచ్చిన ఘటన తెలిసిందే. ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.
News September 14, 2025
నెల్లూరులో యువతి దారుణ హత్య.. UPDATE

బుచ్చి(M) పెనుబల్లికి చెందిన గిరిబాబు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి మైథిలీప్రియ (23) బీఫార్మసీ పూర్తి చేసింది. ఆ సమయంలో సహ విద్యార్థి నిఖిల్ను ప్రేమించింది. కొన్నాళ్లుగా నిఖిల్ మరో యువతితో సన్నిహితంగా ఉండటంపై మైథిలీప్రియ గొడవ పడుతోంది. ఈక్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచి నిఖిల్ <<17695710>>కత్తితో పొడిచి హత్య<<>> చేశాడు. అనంతరం దర్గామిట్ట పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు.