News April 11, 2024

నెల్లూరు: జనసేనలో కీలక నేతగా ఎదిగినా..

image

చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు రూరల్ మండలం కలివెలపాళేనికి చెందిన వారు. NRI అయిన ఆయన జనసేన ఆవిర్భావంలోనే పార్టీలో చేరారు. కీలక విభాగమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిన మనుక్రాంత్ ఈ ఎన్నికల్లో సిటీ సీటు ఆశించారు. కీలకనేతగా ఉన్నా కేడర్ తో కనెక్ట్ కాలేకపోయారని విమర్శలు ఉన్నాయి.

Similar News

News March 20, 2025

నెల్లూరు: 10 మంది టీచర్లు సస్పెండ్

image

Open 10th Examsలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటనలో 10 మంది టీచర్లపై చర్యలు తీసుకున్నట్లు RJD లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కందుకూరు మండలంలోని TRR ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, శ్రీచైతన్య హైస్కూల్‌ పరీక్ష కేంద్రాల్లో Open 10th Exams జరుగుతుండగా RJD తనిఖీ చేశారు. మాస్‌ కాపీయింగ్‌ను ఎంకరేజ్ చేసిన 10మంది టీచర్లను సస్పెండ్ చేయగా, నలుగురు విద్యార్థులను డిబార్ చేశామన్నారు.

News March 20, 2025

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నెల్లూరు జిల్లా వాసి

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ గుండ్రాత్ సతీశ్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్మకూరు నియోజకవర్గం, మహిమలూరు గ్రామానికి చెందిన DRDO మాజీ ఛైర్మెన్, భారత రక్షణ శాఖ సలహాదారు గుండ్రాత్ సతీశ్ రెడ్డికి క్యాబినెట్ హోదా దక్కడంపై ఆత్మకూరు నియోజకవర్గ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 20, 2025

నెల్లూరు: గుండెపోటుతో ఐసీడీఎస్ సూపర్ వైజర్ మృతి

image

నెల్లూరు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ సుకన్య బుధవారం గుండెపోటుతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందారు. గుండెపోటు రావడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

error: Content is protected !!