News September 12, 2024

నెల్లూరు: జపాన్‌లో ఉద్యోగావకాశాలు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్ ఆర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ANM/GNM/ బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి జపాన్ దేశంలో కేర్ వర్కర్స్ ఇన్ హాస్పిటల్స్/ కేర్ హోం ఫెసిలిటీ ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు నెల్లూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, సి.విజయ వినీల్ కుమార్ తెలిపారు. అర్హులైన వారు https://shorturl.at/FB7ok ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

Similar News

News February 22, 2026

కావలి: దైవ దర్శనాకి వెళ్లి ఒకరి మృతి

image

దైవ దర్శనానికి వెళ్తూ ఒకరు మృతి చెందిన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. కావలికి చెందిన పురుషోత్తం(60) ఆత్రేయపురం మండలం వాడపల్లి ఏడువారాల వేంకన్నను దర్శించుకోవాలని రాజమండ్రికి వెళ్లారు. అక్కడ నుంచి ఆటోలో ఆలయానికి బయలుదేరగా RTC బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని నలుగురికి గాయాలయ్యాయి. పురుషోత్తం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆత్రేయపురం SI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 22, 2026

నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

image

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.