News December 16, 2024
నెల్లూరు: జాబ్ మేళాలో 2500 మందికి ఉద్యోగాలు

నెల్లూరు మండలంలోని కనుప్రత్తిపాడులో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 2500 మంది ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు మేళాలో ఎంపికైన 800 మందికి ఆఫర్ లెటర్లు అందించారు. మిగిలిన వారికి సోమవారం పత్రాలను అందించనున్నట్లు వివరించారు.
Similar News
News November 2, 2025
పసికందును బాలల శిశు గృహా కేంద్రానికి తరలింపు.!

కోవూరు ఆర్టీసీ సమీపంలో ముళ్లపొదల్లో లభ్యమైన పసికందును పోలీసులు స్వాధీనం చేసుకుని ఆసుపత్రి తరలించిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న కోవూరు ICDS CDPO శారద సంబంధిత విషయాన్ని జిల్లా ICDS PDకి సమాచారం అందించారు. దీంతో ఆమె హాస్పిటల్కి చేరుకొని ఆ పసికందును నెల్లూరు GGHలోని న్యూ బోరన్ బేబి కేర్ యూనిట్కు తరలించారు. పరీక్షల అనంతరం శిశు గృహానికి తరలించనున్నారు.
News November 1, 2025
నెల్లూరు లేడీ డాన్ అరుణకు రిమాండ్

నెల్లూరు లేడీ డాన్ అరుణకు మరో కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు సూర్యారావుపేట Ps లో ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు జిల్లా జైలులో ఉన్న ఆమెను విజయవాడ పోలీసులు శుక్రవారం పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా కోర్టు 14 రోజుల రిమాండ్ వేయడంతో తిరిగి కేంద్ర కారాగారానికి తరలించారు.
News November 1, 2025
నెల్లూరు: KGBV హాస్టళ్లలలో పోస్టులు

నెల్లూరు జిల్లాలోని KGBV లలో PGT, CRT గెస్ట్ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య ఒక ప్రకటనలో తెలిపారు. లింగసముద్రం, కందుకూరు, సీతారామపురం, కలిగిరి కేజీబీవీలలో ఆయా ఖాళీల సబ్జెక్టులకు సంబంధించి గంటకు రూ. 2చొప్పున చెల్లిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 4 లోపు ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.


