News June 28, 2024
నెల్లూరు జిల్లాకు రూ.219 కోట్లు అవసరం..!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3.19 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. గత నెలలో రూ.96 కోట్లు మంజూరయ్యాయి. పింఛన్ రూ.4 వేలకు పెంచడంతో మరో రూ.30 కోట్లు అదనంగా పంచాలి. అలాగే ఏప్రిల్, మే, జూన్‌కు సంబంధించి పెరిగిన రూ.3 వేలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన జులై ఒకటో తేదీన జిల్లాలో ఒక్కొక్కరికీ రూ.7 వేలు చొప్పున డబ్బులు పంచడానికి రూ.219 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు.
Similar News
News July 5, 2025
రొట్టెల పండుగకు 1,700 మంది పోలీసు సిబ్బంది: IG

రొట్టెల పండుగను పటిష్ట బందోబస్త్ నడుమ ప్రశాంతంగా నిర్వహహించడమే లక్ష్యమని IG సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. శనివారం ఆయన రొట్టెల పండుగ బందోబస్త్ ఏర్పాట్లను ఎస్పీ కృష్ణకాంత్‌తో కలసి నిర్వహించారు. పోలీసు సిబ్బంది మానవతాదృక్పదంతో వ్యహరించి విధులు నిర్వహించాలని సూచించారు. 1,700 మంది పోలీసు ఫోర్స్‌తో సర్వం సన్నద్ధం చేశామని తెలిపారు. రొట్టెల పండుగలో వాహనాల పార్కింగ్ అనేది కీలకం అని చెప్పారు.
News July 5, 2025
నెల్లూరు: చిన్నారుల కోరిక.. స్పందించిన లోకేశ్

నెల్లూరు VR స్కూల్ వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తామూ చదువుకుంటామని కమిషనర్‌ను కోరిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి లోకేశ్ ‘X’ వేదికగా స్పందించారు. ఆ చిన్నారుల విద్యాభ్యాసానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడి అధికారులను ఆదేశించాను. ‘పేదరికం నుంచి బయటకు తెచ్చే ఒకే ఒక సాధనం విద్య. చిన్నారులు కలలను సాకారం చేసుకునేందుకు అన్ని విధాల అండగా నిలుస్తాం’ అని ఆయన వెల్లడించారు.
News July 5, 2025
ఐటీఐ, వెల్డర్ అభ్యర్థులకు ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు

ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐటీఐ, వెల్డర్ అభ్యర్థులకు ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.